నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం,మల్హర్ రావు మండలాల వ్యాప్తంగా ఆదివారం ఉరుములు,మెరుపులతో కూడిన బారి వర్షం కురిసింది.రెండు,మూడు గంటలపాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.మానేరు,వాగులు ఉదృతంగా ప్రవహించాయి.మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలోని చిన్నతరహా ప్రాజెక్టు బొగ్గులవాగు ప్రాజెక్టు, కాపురం చెరువు,కుంటలు,చెరువులు మత్తళ్ళు దుకాయి.కాటారం మండలంలోని దామెరకుంట టు అన్నారం మద్యలో ఉన్న వాగు ఉదృతంగా ప్రవహించడంతో చెన్నూర్ కు రాకపోకలు బంద్ అయ్యాయి.లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పత్తి,వరి పొలాలు నీట మునిగాయి.పశువుల కాపర్లు,మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తహశీల్దార్ రవికుమార్, కొయ్యుర్ ఎస్ఐ నరేశ్ హెచ్చరికలు జారీ చేశారు.అత్యవసర సమయంలో 7995088372 నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు.