నవతెలంగాణ – హైదరాబాద్: చెన్నైలో కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా కుండపోత వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలు కాలనీలు చెరువుల్లా మారిపోయాయి. రహదారులు నదులను తలపించాయి. దాంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో పలుచోట్ల పార్క్ చేసి ఉన్న వాహనాలు కొట్టుకుపోయాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దాంతో చెన్నై నగరపాలక సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. విపత్తును ఎదుర్కొనే చర్యలు చేపట్టారు. వరద కారణంగా ఎక్కడా ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు. గిండి ఏరియాలో కుండపోత వర్షం కురుస్తున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.