ఢిల్లీలో భారీ వర్షం…

నవతెలంగాణ – న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తున్నది. హస్తినలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ద్వారకా, శాస్త్రీ భవన్, బాదర్‌పూర్‌ ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తాజా వానలతో ఢిల్లీ, గురుగ్రామ్‌, నోయిడా ప్రాంతాల్లో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినట్లయింది. కాగా, ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతంలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని రీజినల్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ సెంటర్‌ తెలిపింది. 27 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయిని వెల్లడించింది.

Spread the love