నవతెలంగాణ-ఆలేరు రూరల్
మండలంలోని కొలనుపాక గ్రామంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం ఆదివారం కురిసింది.గ్రామంలో బోనాలపండుగ సందర్భంగా వనభోజనాలు నిర్వహించారు. మధ్యాహ్నం సమయంలో ఈదురుగాలులు వీచి భారీ వర్షం కురువగా గ్రామం నుండి బావుల దగ్గరికి వెళ్లిన ప్రజలు నానాఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది.సుమారు రెండుగంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడి అక్కడక్కడ చెట్లకొమ్మలు విరిగి రోడ్ల మీద పడ్డాయి.వాటిని తీయడానికి గ్రామపంచాయతీ సిబ్బంది నానాఅవస్థలు పడ్డారు.