నవతెలంగాణ-మంచిర్యాల
మంచిర్యాల జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు భారీ వర్షం కురిసింది. పట్టణంలోని రోడ్లన్ని జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కాలనీల్లో వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అత్యవసర సమయంలో గొడుగులు, రైన్ కోట్‌లు ధరించి వీధుల్లోకి వచ్చి పనులు ముగించుకున్నారు. పలు కాలనీల్లో డ్రైనేజీ లేక పోవడం తో వర్షపు నీరు రోడ్లపై చేరింది.