ఉత్తర తెలంగాణలో విస్తారంగా వాన

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం విస్తారంగా వాన పడింది. పలు చోట్ల భారీ వర్షం కురిసింది. శుక్రవవారం రాత్రి 9 :00 గంటల వరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గన్పూర్‌ మండలం చెల్పూర్‌లో అత్యధికంగా 8.03 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం లక్ష్మిదేవిపేటలో 7.8 సెంటీమీటర్ల వాన పడింది. ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. శనివారం నాడు కూడా రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Spread the love