నవతెలంగాణ – హైదరాబాద్: వచ్చే 3 రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మూడు రొజులపాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.