పాక్‌లో భారీ వర్షాలు

పాక్‌లో భారీ వర్షాలు– 24 గంటల్లో 8 మంది పిల్లలు మృతి
పాకిస్థాన్‌ : పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని వివిధ జిల్లాల్లో కురుస్తున్న తీవ్ర వర్షాల వల్ల జనజీవనం స్తంభించింది. అనేక ఇళ్లు కూలిపోవడంతోపాటు పలు చోట్ల తీవ్ర నష్టం వాటిల్లినట్టు విపత్తు నిర్వహణ అధికార ప్రతినిధి అన్వర్‌ షాజాద్‌ తెలిపారు. పలు ఘటనల్లో గత 24 గంట్లోనే 8 మంది పిల్లలు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడినట్టు వెల్లడించారు. మృతుల్లో మూడు నుంచి ఏడేళ్ల వయసున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు ఉన్నారని చెప్పారు. ఈ నెల ప్రారంభంలోనూ ఇదే ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల సుమారు 30 మందికి పైగా మరణించిన సంగతి విదితమే.

Spread the love