తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలు బంద్‌

నవతెలంగాణ – చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు తడిసిముద్దవుతున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుంభవృష్టి  కురుస్తున్నది. దీంతో కడలూర్‌, మైలాదుతురై, విల్లుపురం జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా పుదుచ్చేరిలో  కూడా స్కూళ్లు, కాలేజీలకు హాలీడే ఇచ్చారు. ఇక చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, చుద్దలోర్‌ జిల్లాల్లో, పుదుచ్చేరిలో మంళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎగువ వాయుగుండం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.

Spread the love