నవతెలంగాణ -హైదరాబాద్: తెలంగాణకు 3 రోజులు వర్షాలు వర్షాలు కురుస్తాయని..హైదరాబాద్ ప్రజలు బయటకు రావొద్దని కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు మంత్రి తలసాని. తెల్లవారు జాము నుండి ఏకధాటిగా వర్షం కురుస్తున్నందున ఎక్కడ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలన్నారు. ప్రజలు అత్యవసర సేవల కోసం GHMC కంట్రోల్ రూమ్ కు పిర్యాదు చేయండని వెల్లడించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కాగా, హైదరాబాద్ మహానగరంలో మరోసారి వర్షం దంచి కొడుతోంది. గత 15 రోజులుగా వర్షం లేని హైదరాబాదులో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. సోమాజిగూడ, ఖైరతాబాద్ పంజాగుట్ట జూబ్లీహిల్స్ చింతల్ జగద్గిరిగుట్ట శంషాబాద్ రాజేంద్రనగర్ నారాయణగూడ హైటెక్ సిటీ మల్కాజిగిరి ఉప్పల్ తదితర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు విరామం లేకుండా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలుపుతోంది.