యూఏఈలో భారీ వర్షాలు..

heavy rain in UAEన‌వ‌తెలంగాణ‌ – దుబాయ్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వానలకు ప్రధాన రహదారులు, వీధుల్లోకి నీరు చేరింది. దుబాయ్‌ వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు చిక్కుకుపోయాయి. తీవ్ర గాలుల తాకిడికి.. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. చాలా మంది కార్మికులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు. వీధుల్లోని, రహదారుల్లోని నీటిని తోడడానికి అధికారులు ట్యాంకర్లను పంపించారు. మరోవైపు పొరుగునున్న ఒమన్‌లో కురిసిన భారీ వర్షాలకు మృతుల సంఖ్య 18కు చేరగా.. మరికొందరి ఆచూకీ ఇంకా తెలియరాలేదని ఆ దేశ అత్యవసర నిర్వహణ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. బహ్రెయిన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా దేశాల్లోనూ వానలు పడ్డాయి.

Spread the love