భారీ వర్షాలు.. అమరనాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

నవతెలంగాణ – శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో నిన్న  రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలచోట్ల వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో అమరనాథ్ యాత్రకు ఈ రోజా తాత్కాలిక బ్రేక్ పడింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో బల్తాల్, పహల్గాం రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షంలో పవిత్ర అమరనాథ్‌ గుహలోకి యాత్రికులు వెళ్లడం కష్టమన్నారు. అందుకే 3,200 మంది యాత్రికులను నున్వాన్ పహల్గామ్ క్యాంపు దగ్గర, 4,000 మంది యాత్రికులను బల్తాల్ క్యాంపు దగ్గర నిలిపివేశామని చెప్పారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత యాత్రను పునఃప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.

Spread the love