భారీ టిప్పర్‌ వాహనాలు రోడ్డుపై వెళ్లనీయం

నవతెలంగాణ- ఆలేరుటౌన్‌
ఆలేరు పట్టణం నుండి గుండ్లగూడెం మీదుగా వరంగల్‌ వెళ్లే పాత జాతీయ రహదారి పై ఇకనుండి భారీ టిప్పర్‌ వాహనాలను వెళ్లనీయమని గుండ్లగూడెం మాజీ సర్పంచి జూకంటి పౌల్‌ అన్నారు. మెయిన్‌ రోడ్డుపై భారీ వాహనాల దాటికి ఏర్పడిన ప్రమాదకరమైన భారీ గుంతను గ్రామస్థులు, యువకులతో కలిసి గురువారం పరిశీలించారు.గుంతలు ఏర్పడటానికి కారణమైన భారీ వాహనాలను ఆపి ప్రమాదం జరిగే అవకాశం ఉందని జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. అనంతరం గుంత వద్ద పొంచి ఉన్న ప్రమాద హెచ్చరిక లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ,గ్రామస్థులతో పాటుగా కొంపల్లి సందీప్‌, గ్యార ప్రవీణ్‌, ఏసిరెడ్డి సత్తిరెడ్డి,లక్కాకుల సాయికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love