హలో మాదిగ.. ఛలో వరంగల్ కవాతుని విజయవంతం చేయాలి 

– కాటారం ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు…మంతెన చిరంజీవి మాదిగ
నవతెలంగాణ మల్హర్ రావు
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ లో జూలై 7న నిర్వహించే హలో మాదిగ ఛలో కవాతు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాటారం ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి మాదిగ ఓ మంగళవారం ఒక ప్రకటనలో  పిలునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు మాదిగల జాతిపిత, ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఎమ్మార్పిఎస్ ని స్థాపించి 30 వసంతాలు పూర్తిచేసుకున్న క్రమంలో మన మాదిగ జాతి ఉనికి చాటి చెప్పేలా మాదిగ మహాజన కవాతు కార్యక్రమానికి పూనుకున్నారని పేర్కొన్నారు. ఎస్సి వర్గీకరనే లక్ష్యంగా నిర్వహించే కార్యక్రమానికి కాటారం మండలం లోని ప్రతీ మాదిగ బిడ్డతో పాటు ఎమ్మార్పిఎస్ కార్యకర్తలు తమ బాధ్యతగా భావించి అధిక సంఖ్యలో తరిలివచ్చి కవాతు సభను విజయవంతం చేయాలని కోరారు.
Spread the love