పేద కుటుంబానికి సహాయం

నవతెలంగాణ – కరీంనగర్

పేదలను, అనాధలను ఆపదలో ఆదుకొనే స్వదేశీ సేవా దిగ్గజం అసోసియేషన్ అఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 137 ఏ లో మహిళా సాధికారత కోసం స్థాపించబడిన ఆలయన్స్ క్లబ్స్ ఆఫ్ మహాశక్తి ఆధ్వర్యంలో ఓ పేద కుటుంబానికి ఆపన్న హస్తం అందించారు. వివరాల్లోకి వెళ్తే గంగాధర మండలం ఆచంపల్లి గ్రామంలో ఈమధ్యనే అక్కెన పల్లి రవి అనే వ్యక్తి అనారోగ్యముతో చనిపోయాడు. ఆయనకు భార్య మమత తో పాటు నలుగురు ఆడ పిల్లలు ఉన్నారు. ముందే పేదరికం ఆపై ఆడపిల్లలను పోషించడం ఆ మహిళకు భారం అవుతున్న పరిస్థితులలో ఆ నిరుపేద కుటుంబానికి 25 కిలోల బియ్యం తో పాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇచ్చి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆలయన్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్లు డా. ఎలగందుల శ్రీనివాస్, కోలా అన్నారెడ్డి డిస్ట్రిక్ట్ గవర్నర్ గాలిపల్లె నాగేశ్వర్, మహా శక్తి కోశాధికారి నాజియా లుఆర్థికంగా సహాయాన్ని అందించినట్లు అలయన్స్ క్లబ్ ఆఫ్ మహాశక్తి క్లబ్ అధ్యక్షులు రేణుక కార్యదర్శి సంజన లు తెలిపారు, ఈ కార్యక్రమంలో డ్యాని, మమత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love