‘మా’ నుంచి హేమ సస్పెండ్..

నవతెలంగాణ – హైదరాబాద్: రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు బిగ్ షాక్ తగిలింది. ఆమెను ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ సస్పెండ్ చేసింది. ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా హేమ ప్రస్తుతం బెంగళూరులోని పరప్ప అగ్రహార జైలులో ఉన్నారు.

Spread the love