ఇకమీదట మంత్రులు, ఎమ్మెల్యేలు కరెంటు బిల్లులు కట్టాల్సిందే: సీఎం

నవతెలంగాణ – అస్సాం: జులై నుంచి రాష్ట్రంలోని ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు తమ విద్యుత్ బిల్లులను సొంత డబ్బులతో చెల్లించుకోవాల్సి ఉంటుందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. నేనూ, చీఫ్ సెక్రటరీ జులై 1నుంచి ఈ నిబంధనను ఆచరిస్తామని అన్నారు. ‘‘గత 75 ఏళ్లుగా మన మంత్రులు, ప్రభుత్వ సీనియర్, సచివాలయ అధికారుల నివాసాలకు, విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రజలు చెల్లించే టాక్స్‌ సొమ్ముతో ప్రభుత్వ అధికారులకు విద్యుత్తు బిల్లులు చెల్లించే వీఐపీ సంస్కృతికి ముగింపు పలుకుతున్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా వారి విద్యుత్ వినియోగానికి అయ్యే బిల్లులను వారే చెల్లించాల్సి ఉంటుంది’’ అని హిమంత బిశ్వశర్మ ఎక్స్‌ ఖాతా వేదికగా వెల్లడించారు. దీనివల్ల విద్యుత్ బోర్డుకి వచ్చే నష్టాలను నివారించవచ్చని, బదులుగా వారు విద్యుత్ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉండదని సీఎం స్పష్టం చేశారు.

Spread the love