ఈవిఎం విశేషాలు ఇవిగో..

నవతెలంగాణ – మల్హర్ రావు
ఓటు వేసే విధానం.. ఈవిఎం ఓటింగ్ విధానంలో కంట్రోల్ యూనిట్ ప్రిసైడింగ్ అధికారివద్ద,బ్యాలెట్ యూనిట్, వివిఫ్యాట్ ఓటింగ్ కంఫర్ట్మేంట్ లో ఉంటుంది. బ్యాలెట్ యూనిట్ పై ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న బ్ల్యూ బటన్ నొక్కగానే ఎరువు రంగు లైట్ మేరుస్తోంది. ఎంపిక చేసుకున్న అభ్యర్థి సీరియల్ నెంబసర్, పెరు, గుర్తు చూపించే పేపర్ స్లీప్ వివిఫ్యాట్ విండో ద్వారా సుమారు ఏడు సెకండ్లపాటు కనిపించి డ్రాప్ బాక్సులో పడగానే కొద్దీ సేపు బీఫ్ అనే శబ్దం వస్తుంది. దీంతో ఓటు నమోదైందని తెలుసుకోవచ్చు.
నిర్దారించుకున్న తరువాతే.. పోలింగ్
పోలింగ్ ప్రారంభానికి ముందు కంట్రోల్ యూనిట్ లో రిజల్ట్ బటన్ నొక్కి ఇప్పటికే దాచిన ఓట్లెవి నమోదు కాలేదని ప్రిసైడింగ్ అధికారి హాజరైన పోలింగ్ ఏజంట్లకు ప్రదర్శిస్తారు.వివి ఫ్యాట్ డ్రాప్ బాక్స్ తెరిచి ఖాళీగా ఉందని చూస్తారు. వారి సమక్షంలో కనీసం 50 ఓట్లతో మాక్ పోల్ నిర్వహిస్తారు.ఆ తరువాత ఆ ఫలితాన్ని క్లియర్ చేసి అసలు పోల్ ప్రారంభించే ముందు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో కంట్రోల్ యూనిట్ వివి ఫ్యాట్ కు సిల్ వేస్తారు.
పోలైన ఓట్లసంఖ్య ఇలా తెలుసుకోవచ్చు…
ఈవిఎం కంట్రోల్ యూనిట్ లో ఫలితం బటన్ తోపాటు, టోటల్ బటన్ ఉంటుంది. పోల్ సమయంలో ఎప్పుడైన ఈ బటన్ నొక్కితే అప్పటివరకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య తెలుస్తోంది. పోలింగ్ ముగియగానే క్లోజ్ బటన్ నొక్కితే మిషన్ ఇకపై ఓట్లను అంగీకరించదు.
ఈవిఎంల భద్రత..
పోలింగ్ తరువాత ఈవిఎంలను స్ట్రాoగు రూములో సెక్యూరిటీ బలగాల పహరలో భద్రపరుస్తారు.పోటీలో ఉన్న అభ్యర్థులు నియమించిన ఏజంట్లు కౌoటింగ్ వరకు ఈవిఎంలను 24 గంటలు చూసేందుకు అనుమతిస్తారు.ఈవిఎంలు బద్రపరిచిన స్ట్రాoగు రూములకు తాళాలు వేసి ఎన్నికల అధికారులతోపాటు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సంతకాలతో సిల్ చేస్తారు.
కౌoటింగ్ డే..
కౌoటింగ్ రోజున అభ్యర్థులు వారి ప్రతినిధులు రిటర్నింగ్ అధికారి,ఎన్నికల సంఘము పరిశీలకుల సమక్షంలో ఈవిఎంలు బద్రపరిచిన స్ట్రాoగు రుములు తెరుస్తారు. అభ్యర్థులు కౌoటింగ్ ఏజంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు పూర్తియిన తరువాత వివిఫ్యాట్ స్లిప్ లను బయటకు తీసి అభ్యర్థులు వారి ప్రతినిధుల సమక్షంలో నల్లటి కవర్ లో బద్రపరుస్తారు.
Spread the love