ఇప్పట్లో రాజకీయ ప్రవేశం లేదు: హీరో విశాల్

నవతెలంగాణ – చెన్నై: త‌మిళ హీరో విజ‌య్ రాజ‌కీయ పార్టీ ఏర్పాటు ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌గానే మ‌రో హీరో విశాల్ రాజ‌కీయ ప్ర‌వేశం గురించి పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. హీరో విశాల్ రాజ‌కీయ పార్టీ పెడ‌తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తన పొలిటిక‌ల్ ఎంట్రీపై వస్తున్న వార్తలపై విశాల్ స్పందించాడు. తాను ఇప్ప‌ట్లో రాజకీయాల్లో ప్ర‌ వేశించే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేశారు. భ‌విష్య‌త్‌లో రాజ‌కీయాల్లో అడుగుపెట్టే అవ‌కాశం లేక‌పోలేద‌ని విశాల్ తేల్చిచెప్పారు. తాను రాజ‌కీయ ల‌బ్ధి కోసం పాకులాడే వ్య‌క్తిని కాద‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే అంకిత‌భావం త‌న‌కుంద‌ని అన్నారు. భ‌విష్య‌త్‌లో ప‌రిస్ధితులు మారితే ప్ర‌జ‌ల‌కు మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వహించేందుకు తాను సిద్ధ‌మ‌ని చెప్పారు. భ‌విష్య‌త్‌లో పరిస్ధితులు నిర్ధేశిస్తే ప్ర‌జ‌ల్లో ఒక‌డిగా వారి గొంతుక వినిపిస్తాన‌ని చెప్పుకొచ్చారు.

Spread the love