హాయ్ కవితా… హాల్లో బండిగారు…

నవతెలంగాణ నిజామాబాద్: ఎప్పుడూ ఉప్పు-నిప్పుగా ఉండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. నిజామాబాద్‌లో బీజేపీ నేత బస్వ నర్సయ్య నూతన గృహ ప్రవేశంలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కార్యక్రమానికి దాదాపు ఒకే సమయంలో వచ్చిన బండి సంజయ్‌, కవిత  పరస్పరం ఎదురుపడ్డారు. దీంతో ఒకరికి ఒకరు నమస్కారం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, జిల్లా జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌ రావులను సంజయ్‌కు కవిత పరిచయం చేశారు.

Spread the love