తెలంగాణకు హై అలర్ట్…

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణలో రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ 3 వరకు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో సైతం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Spread the love