నవతెలంగాణ – హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హై అలర్ట్‌లోకి వెళ్లాయి. కథువా సరిహద్దు గ్రామంలో ఆయుధాలతో ఇద్దరు ముష్కరుల కదలికలను పసిగట్టినట్టు వార్తలు వస్తున్నాయి. వారు పఠాన్‌కోట్ చేరుకోవడాన్ని కొట్టిపారేయలేమని, ఆగస్టు 15 లేదా 16, 17 తేదీల్లో ఢిల్లీ, పంజాబ్‌లో దాడులకు తెగబడొచ్చని ఏజెన్సీల అనుమానం. జూన్ 1నే పేలుడు పదార్థాలతో కూడిన ఓ కన్‌సైన్‌మెంట్ జమ్మూ నగరంలోకి రావడం గమనార్హం.