చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ తరపు లాయర్ల వాదనలను పరిగణలోకి తీసుకొని చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. క్వాష్ పిటిషన్ కొట్టివేస్తున్నట్టు ఏక వాఖ్యంతో హైకోర్టు తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది. ఈనెల 19న ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. నేడు తీర్పు వెలువరించింది.

Spread the love