ధోనికి హైకోర్టు నోటీసులు జారీ

నవతెలంగాణ – హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్ ధోనీకి తాజాగా నోటీసులు జారీ చేసింది జార్ఖండ్ హైకోర్టు. మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, సౌమ్య దాస తనను రూ 15 కోట్ల మేర మోసం చేశారని జనవరి 5న రాంచీలో ధోని కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే స్థానిక జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు తమపై ఆదేశించిన విచారణను సవాలు చేస్తూ దివాకర్, దాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధోనీకి నోటీసులు ఇచ్చింది. దీంతో ధోని త్వరలోనే కోర్టులో హాజరు కావాల్సి ఉంది. మరి జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన నోటీసులపై భారత మాజీ క్రికెటర్ ధోనీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Spread the love