మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు

నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లలో కేటీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. వీటిపై విచారణ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. కేటీఆర్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సిరిసిల్ల రిటర్నింగ్ ఆఫీసర్‌కు నోటీసులు జారీ చేశారు. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.

Spread the love