వార్డు కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

నవతెలంగాణ – హైదరాబాద్
జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డు కమిటీలను నియమించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో ఫోరం ఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌ (ఎఫ్‌ఎ్‌ఫజీ) సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వార్డు కమిటీలను నియమించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 ఎస్‌, జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ సెక్షన్‌ 8కు విరుద్ధమని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ఽధర్మాసనం.. వివరణ ఇవ్వాలని చీఫ్‌ సెక్రటరీ, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసిం ది. ఈ విషయమై ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి ఓ ప్రకటన విడుదల చేస్తూ స్థానిక సమస్యలను పరిష్కరించడంలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచడానికి మున్సిపల్‌ డివిజన్‌ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉందని, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ సభ్యులు, స్వచ్ఛం ద సేవా సంస్థల ప్రతినిధులతో ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని చట్టం నిర్దేశిస్తోందన్నారు. కానీ ప్రజా భాగస్వామ్యం అవసరం లేదన్నట్లుగా ప్రభుత్వం 10 మంది అధికారులతో వార్డు కా ర్యాలయాలను తెరిచిందని ఆరోపించారు.

Spread the love