నవతెలంగాణ-హైదరాబాద్: జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మోహన్‌బాబు అభ్యర్థించారు. దీన్ని కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.