నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో బెన్‌ఫిట్ షోల అనుమతిపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం నడుచుకోవాలని చెబుతూ.. విచారణను వాయిదా వేసింది. సినిమా టికెట్ల ధరలపై పెంపు, ప్రత్యేక షోల అనుమతికి సంబంధించిన ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. సినిమాకి టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య ఎలాంటి షోలకు అనుమతి వద్దని, ఈ చట్టాన్ని ఫాలో అవ్వాలని సూచించింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణ వచ్చేనెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.