బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్

నవతెలంగాణ – హైదరాబాద్: ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులను చూపకుండా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టులో ఎన్నికల పిటీషన్‌ దాఖలైంది. ఈ పిటీషన్‌లో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా.. 2018కి చెందిన కేసులో ఇప్పటి వరకూ కౌంటర్ పిటీషన్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో గొంగిడి సునీతకు 10 వేల రూపాయల జరిమానా న్యాయస్థానం విధించింది. అక్టోబర్ 3లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 3కు హైకోర్టు వాయిదా వేసింది.

Spread the love