– రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
ఆయిల్ ఫామ్ సాగు తో రైతులకు అధిక లాభాలు వస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు మంగళవారం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం గోపాల గిరిలో పామాయిల్ కర్మాగారానికి శంకుస్థాపన చేసిన అనంతరం హారిపి రాల గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేసిన మంత్రి అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా లో 6,535 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతున్నది. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది అని తెలిపారు.
గోపాల గిరి పామాయిల్ ఫ్యాక్టరీ ప్రత్యేకతలు: ఈ ఆయిల్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో 30 టన్నుల నుండి 60 టన్నుల సామర్థ్యంతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి 82 ఎకరాల స్థలాన్ని కేటాయించారు ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ. 175 కోట్ల వ్యయము అవుతుంది. గంటకు 60 టన్నుల ఆయిల్ ఫామ్ గెలలను మిల్లింగ్ చేసే సామర్థ్యం గల ఈ ఫ్యాక్టరీ దేశంలోనే అతిపెద్దది ఈ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల సుమారు 300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని తెలిపారు. ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వల్ల పామాయిల్ సాగు విస్తీర్ణం పెరగడమే కాక ఫ్యాక్టరీ రైతులకు అందుబాటులో ఉంటుంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు

అనంతరం ఫ్యాక్టరీ నిర్మాణ స్థలంలో భారీ బహిరంగ సభ జరిగింది.