వ్యవసాయంలో ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి

– మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌
– పిచికారీ డ్రోన్‌ పనితీరు పరిశీలన
నవతెలంగాణ-శామీర్‌పేట
వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, మేలకువలు పాటించి అధిక దిగుబడులు సాధించి ఆర్ధ్థిక పరిపుష్టి పొందాలని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ రైతులకు సూచించారు. శనివారం శామీర్‌ పేట మండలం బొమ్మరాసిపేటలో శనివారం వ్యవసాయ పొలాల వద్ద ఎరువు మందుల పిచికారి డ్రోన్‌ను ఫ్యాక్ట్‌ కంపెనీ ప్రతినిధులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్‌ కలెక్టర్‌ గౌతమ్‌ హాజరై పిచికారీ డ్రోను పనితీరును పరిశీలించారు. పిచికారీ డ్రోను పనితీరును ఫ్యాక్ట్‌ కంపెనీ ప్రతినిధులను ఈ సందర్భంగా కలెక్టర్‌ అడిగి తేలుసుకున్నారు. రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఫ్యాక్ట్‌ కంపెనీ వారు డ్రోను పనితీరును వివరించారు. ఈ కార్యక్రమ ంలో ఇన్‌చార్జి డీఏఓ వెంకట్రాంరెడ్డి, ఏఓలు రమేష్‌, ఆసీయాబేగం, హెచ్‌ఓ రేణుక, ఏఈఓ రవి, రైతులు రవికిరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love