నవతెలంగాణ – హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో మూడు సినిమాలు తీయనున్నట్లు హొంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ఇప్పటికే తీసిన ‘సలార్’ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ‘సలార్-2’తో పాటు మరో రెండిటికి ప్రభాస్ హొంబలే ఫిల్మ్స్ కు సైన్ చేసినట్లు తెలిపింది. ఇవి 2026,2027, 2028లో విడుదల అవుతాయని ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రశాంత్ వర్మ, లోకేశ్ కనగరాజ్‌తో తీసే సినిమాలను హొంబలే నిర్మిస్తున్నట్లు సమాచారం.