హిందీ భాష గొప్పది, స్వతంత్ర పోరాటంలో హిందీ భాషా ముఖ్య భూమిక..

– యూనివర్సిటీ లో హిందీ భాష దినోత్సవం..
నవతెలంగాణ – డిచ్ పల్లి
హిందీ భాష గొప్పదని, స్వతంత్ర పోరాటంలో హిందీ భాషా ముఖ్య భూమిక పోషించిందని చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉర్దూ డాక్టర్ మోహమ్మద్ అబ్దుల్ ఖవి అన్నారు.గురువారం తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కళాశాలలో హిందీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ అబ్దుల్ ఖవి  చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉర్దూ పాల్గొని మాట్లాడుతూ హిందీ భాష గొప్పదని, స్వతంత్ర పోరాటంలో హిందీ భాషా ముఖ్య భూమిక పోషించిందని పేర్కొన్నారు. ప్రముఖ హిందీ రచయితలు ప్రేమ్ చంద్, మీరాబాయి, కబీర్, సూరి దాస్, హిందీ భాష వికాసానికి తోడ్పాటు అందించారని వివరించారు.భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మిళనాన్ని భారతదేశంలో అనేక భాషలు ఐకత్వాన్ని చాటుతాయని  తెలిపారు.ఈ కార్యక్రమంలో హిందీ విభాగ అధ్యక్షుడు డాక్టర్ జమీల్ అహ్మద్ మాట్లాడుతూ హిందీ భాషా లోని  పాటలను విని అన్ని ప్రాంతాల నిరక్షరాశులు అర్థం చేసుకుని ఆనందిస్తారని తెలిపారు. హిందీ భాషలో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పార్వతి చైర్మన్ బిఓఎస్   పార్ట్ టైం అధ్యాపకులు డాక్టర్ తాహెర్ ,డాక్టర్ అశోక్ చౌహన్, విద్యార్థులు అనిల్, నవీన్,మనీష్,శ్రావణ్ కుమార్, విద్యార్థులు పాల్గొనిఅధ్యాపకులను  ఘనంగా పూలు శాలువాలతో సన్మానించారు.
Spread the love