చరిత్రను ఎలుగెత్తి చాటాలి

చరిత్రను ఎలుగెత్తి చాటాలి– ప్రజానాట్యమండలి శౌర్య యాత్ర శిక్షణా తరగతుల్లో
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రజానాట్యమండలి శౌర్య యాత్ర చారిత్రక వాస్తవాలను ప్రజలకు వివరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలో సోమవారం ప్రజా నాట్యమండలి (పీఎన్‌ఎం) శౌర్య యాత్ర కళారూపాల శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో పీఎన్‌ఎం పాత్రను వివరించారు. ఏ ఏ ఆంశాలపై కళారూపాలు ఉండాలో, వాటి ప్రాధాన్యతను వివరించారు. ఏ ఆంశం వివరించినా ప్రజలకు అర్థమయ్యే విధంగా.. కండ్లకు కట్టినట్టు చెప్పాలన్నారు. పలు సాంస్కృతిక ఆంశాలపై సుదీర్ఘంగా వివరించారు. పీఎన్‌ఎం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి ప్రత్యేక కళారూపాలు రూపొందించనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకుని శౌర్య యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌, పీఎన్‌ఎం రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ నాయకులు, కళాకారులు పాల్గొన్నారు.

Spread the love