మేడారంలో హెచ్ఐవి పై అవగాహన

నవతెలంగాణ – గోవిందరావుపేట
మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం  వై ఆర్ జి కెర్ లింకు వర్కర్ స్కీం, మారి వరంగల్ వారు వాలుపోస్టర్స్, కరపత్రాలను పంచుతూ హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఎయిడ్స్ రాకుండా జాగ్రత్తలు వచ్చినవారు ఇలాంటి మందులు వాడాలి ధైర్యంగా ఉండాలి సమాజంలో అధైర్య పడకుండా సాటి జనం ఆదరించే విధంగా మసులుకోవాలనీ పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ములుగు క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ కే జ్యోతి, మారి ప్రాజెక్టు మేనేజర్ విజయ్, రాము, వీరన్న, లింగన్న, కిషన్, కవిత, సంజయ్, నరేష్ జాతర ప్రజలు, తదితరులు పాల్గొన్నారు
Spread the love