ఢిల్లీలో హిజ్బుల్‌ ముజాహిద్‌ ఉగ్రవాది అరెస్ట్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది జావేద్‌ అహ్మద్‌ మట్టును పోలీసులు అరెస్టయ్యాడు. ఢిల్లీలో స్పెషల్‌ సెల్‌ గురువారం అరెస్టు చేసింది. జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పలు హత్యల్లో జావేద్‌ అతని ప్రమేయం ఉన్నట్లు సమాచారం. అతని తలపై రూ.10లక్షల రివార్డు సైతం ఉన్నది. ఇక్బాల్ అహ్మద్ పాకిస్థాన్ వెళ్లి తీవ్రవాద శిక్షణ తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టు ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలోని సోపోర్ నివాసి. 2009లో ఉగ్రవాదం బాటపట్టాడు. హిజ్బుల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయి. జావేద్ హిజ్బుల్ టాప్ కమాండర్లలో ఒకడు. హిజ్బుల్ కమాండర్లలో చాలా మంది భద్రతా దళాల చేతిలో ఇప్పటికే హతమయ్యారు. వీరిలో ఇద్దరు టాప్ కమాండర్లు మాత్రమే మిగిలారు. ఇందులో ఒకరు పాకిస్తాన్‌కు పారిపోగా.. తాజాగా జావేద్‌ మట్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Spread the love