జీ 20 విద్యాసదస్సుకు హెచ్ఎం శ్రీనాథ్ ఎంపిక..

నవతెలంగాణ-భిక్కనూర్
మహారాష్ట్రలోని పూణే పట్టణంలో జరగనున్న జి20 సదస్సుకు భిక్కనూర్ పట్టణంలో గల బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్ ఎంపికైనట్లు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 16 నుండి 22 వరకు జీ 20 విద్యాసదస్సులో ఆయా సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న తొలిమెట్టు సాంకేతిక విద్య సామాజిక అంశాలపై సదస్సులో చర్చించనున్నారు ఆయా దేశాలకు చెందిన విద్యాశాఖ మంత్రులు సైతం పాల్గొననున్నారు. సదస్సుకు ఎన్ని కావడం పట్ల జిల్లా విద్యాధికారులు అభినందించారు.

Spread the love