అనారోగ్యంతో హోంగార్డ్ లింగం మృతి

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని కోస్లి గ్రామానికి చెందిన హోంగార్డ్ ఆసది లింగం(48) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. లివర్ వ్యాధితో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో గత కొన్ని రోజుల నుండి చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత పది సంవత్సరాలుగా స్థానిక పోలీస్ స్టేషన్ లో కోర్టు హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడని మృతికి పోలీస్ సిబ్బంది సంతాపాన్ని ప్రకటించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.అంత్యక్రియలు శనివారం నిర్వహించినట్లు తెలిపారు.
Spread the love