డ్యూటీలు బంద్ చేస్తున్నాం: హోంగార్డ్స్ జేఏసి ప్రకటన..

నవతెలంగాణ – హైదరాబాద్: జీతాల ఆలస్యంతో హైదరాబాద్ గోషామహల్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు రవీందర్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ ను జేఏసి నేతలు పరామర్శించారు. రవీందరు మద్దతుగా రేపట్నుంచి రాష్ట్రంలో డ్యూటీలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించిన జేఏసి నేతలు.. , తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు.

Spread the love