– వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
– వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
నవతెలంగాణ-జోగిపేట
నవతెలంగాణ దినపత్రిక భవిష్యత్తులోనూ మరింత ఎదగాలని ఆశిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మంగళవారం ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరైన మంత్రి.. నవతెలంగాణ దినపత్రిక 9వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నవతెలంగాణతో మాట్లాడారు. యాజమాన్యానికి, విలేఖరులకు, అభిమానులకు తొమ్మిదో వార్షికోత్సవ శుభాభివందనాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. చక్కటి వార్తలు, ఎడిటోరియల్స్, మంచి సారం, ఉన్నతమైన భాషా పాండిత్యంతో ప్రజలకు వాస్తవ సమాచారం, విజ్ఞానం అందించాలన్నారు. తొమ్మిదేండ్లుగా కృషి చేస్తున్న యాజమాన్యానికి, భవిష్యత్తులో ఇదే విజన్‌తో ముందుకు వెళ్లాలని ఆశిస్తూ, అభినందిస్తున్నానని తెలిపారు.