హైదరాబాద్ లో దారుణమైన ఘటన..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్పత్రిలో బిల్లు కట్టే ఆర్థిక స్తోమత లేక కన్న కూతురును ఆస్పత్రిలోనే వదిలేశారు తల్లిదండ్రులు. ఈ సంఘటన హైదరాబాద్ కాంచనబాగులోని ఓవైసీ ఆస్పత్రిలో జరిగింది. సైదాబాద్ సింగరేణి కాలనీలో నివాసం ఉండే కే .నితిన్ ప్రవళికలు ఏడాది క్రితం ప్రేమ (కులాంతర) వివాహం చేసుకున్నారు. 13 రోజుల క్రితం కూతురుకు జన్మించింది. కూతురు పుట్టిందన్న ఆనందంలో ఉండగానే చిన్నారికి ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని తెలిసింది. స్థానిక డాక్టర్ సంప్రదించడంతో వెంటనే పెద్దాస్పత్రికి వెళ్లాలని సూచించారు దాంతో వారు పిసల్ బండలోని ఓవైసీ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారిని ఆస్పత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. చిన్నారి ఆరోగ్యం మెరుగుపడడంతో ఐదు రోజుల క్రితం డిశ్చార్జి రాశారు. కానీ చిన్నారికి చికిత్స చేసినందుకు గాను లక్ష 16 వేల రూపాయల బిల్లు కట్టి చిన్నారిని తీసుకు వెళ్లాలని చెప్పడంతో తమ వద్ద ఉన్న 35000 కట్టారు మిగతా డబ్బులు సర్దుబాటు కాకాపోవడంతో ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో తెలిసిన వారినల్ల ప్రాధేయపడిన లాభం లేకపోయింది. నాయకులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో చిన్నారిని ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లారు.

Spread the love