నవతెలంగాణ – హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో వాయిదా పడిన హార్టీకల్చర్ ఆఫీసర్ పరీక్షను ఈ నెల 17న నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 11వ తేదీ (ఆదివారం) నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అనుమతించింది. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతామని ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా అభ్యర్థులు ప్రాక్టీస్ కోసం మాక్‌టెస్ట్ లింకును కూడా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపింది.