నర్సింగ్‌ విద్యార్థినిపై ఆస్పత్రి డైరెక్టర్‌ లైంగిక దాడి

నవతెలంగాణ – హైదరాబాద్: యూపీలోని కాన్పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 22 ఏళ్ల నర్సింగ్‌ విద్యార్థినిపై ఓ ప్రైవేటు ఆస్పత్రి డైరెక్టర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు విద్యార్థిని ఆదివారం ఆసుపత్రిలో నైట్‌షిప్ట్‌ ఉందని వెళ్లింది. తెల్లవారు జామున నిద్రరావడంతో విశ్రాంతి గదిలో నిద్రపోయింది. ఈ క్రమంలో ఆస్పత్రి డైరెక్టర్‌ ఇంతియాజ్‌ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు సోమవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Spread the love