– ఆరోగ్యశ్రీలో ఆరోగ్య మిత్రులను నియమించాలి
– హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవతెలంగాణ-సిటీబ్యూరో
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ వైద్యులతో నిర్వహించిన సమావేశంలో ఆ యన పాల్గొని ఆస్పత్రులలో సర్జరీలు, డెలివరీలు, బయోమెట్రిక్ విధానం, సానిటేషన్,, బార్కస్, కామాటిపుర, దబీర్ పుర ఇంకొక వంద పడకల ఆస్పత్రుల నిర్మాణాలపై తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆస్పత్రిలోకి వచ్చే అవుట్ పేషంట్ చికిత్స చేయడంతో పాటు, ప్రత్యేక చికిత్సలు అవసరం ఉన్నవారికి వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు.వంద పడకల ఆసుపత్రిలుగా మంజూరైన సిహెచ్ సి బార్కస్, కామటిపుర, దబీర్ పుర భవన నిర్మాణాల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రులలో బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలని, ఆస్పత్రులకు సక్రమంగా విధులకు హాజరుకాని డాక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని, ఆస్పత్రులలో పారి శుద్ధ్య సిబ్బందికి సరియైన సమయంలో జీతాలు ఇవ్వని పారిశుద్ధ్య ఏజెన్సీలకు షోకాస్ నోటీసులు జారీ చేయా ల న్నారు. డెంటల్ చైర్స్ అవసరం ఉన్న ఆసుపత్రులకు సర ఫరా చేయాలని అన్నారు. బి ఆర్ కే భవన్ లోని సివిల్ డిస్పెన్సరీలను సెక్రటేరియట్ కు షిఫ్ట్ చేయాలని, ఖైరతాబాద్ లో ఉన్నాయి హెచ్ ఎస్ ఆస్పత్రిని బి ఆర్ కే భవన్ కు షిఫ్ట్ చేయాలని, అంబర్పేట్ ఆసుపత్రిలో ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఆరోగ్యశ్రీలో ఆరోగ్య మిత్రులు లేని చోటా ఆరోగ్య మిత్రులు నియమించాలని సూచించారు. ఆస్పత్రిలో కావలసిన పరికరాల కోసం, ఆసుపత్రిలోనూ ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్ట్ లలో వేరే ఆసుపత్రిలోని డాక్టర్లను ఒ.డి.పై బదిలీ చేయుటకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ డిస ిహెచ్‌ఎస్ ను ఆదేశించారు. ఈ సమా వేశంలో డి సి హెచ్ ఎస్ డాక్టర్ ఏ సునీత, డిహెచ్ కింగ్ కోటి మెడికల్ సూపర్డెం ట్ డాక్టర్ రాజేంద్రనాథ్, ఏ హెచ్ నాంపల్లి డాక్టర్ పి సునీత, ఏహెచ్ మలక్పేట్ డాక్టర్ త్రిలోక్ శ్యామ్, ఏ హెచ్ గోల్కొండ డాక్టర్ మొహమ్మద్ మజాహార్ ఉల్లా, సిహెచ్సి బార్కస్ డాక్టర్ బి ఉమాదేవి, డాక్టర్ కలీం, డాక్టర్ దశరథ్ పాల్గొన్నారు.