కలెక్టర్ ఆదేశానుసారం హాస్టల్ పరిశీలన..

According to the order of the collector, the hostel was inspected.నవతెలంగాణ –  జుక్కల్ 

మండలంలోని వెనుకబడిన తరగతుల బాలికల హాస్టల్ ని జుక్కల్ ఎంపీడీవో శనివారం నాడు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిశీలనలో ఎంపీడీవో తో పాటు జిల్లా బీసీ కార్పొరేషన్ అధికారిని పాల్గొన్నారు. ముందుగా హాస్టల్లోని వంట సామాగ్రిని , వంటకాల వాటి నాణ్యతను పరిశీలించారు.  వంటగది శుభ్రత పైన దృష్టి కేంద్రీకరించాలని ఎప్పటికప్పుడు శుభ్రత చేయాలని వంట చేసే సిబ్బందిని ఆదేశించారు. ఎంపీడీవో పరిశీలనకు వెళ్ళినప్పుడు ఇంచార్జి హాస్టల్  అందుబాటులో ఉండక పోడంతో సమాచారం పూర్తిగా రాలేదని  అన్నారు. తరువాత మూత్రశాలలు వాష్ రూమ్లను పరిశీలించి శుభ్రత చేయాలని పనిచేసే సిబ్బందికి ఆదేశించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతొ సమావేశం  ఏర్పాటుచేసి వారితో పిల్లల పేరెంట్స్ విద్యార్థినిలతో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.  విద్యార్థులు మరియు పిల్లల తల్లిదండ్రులతో ఎంపీడీవో జిల్లా అధికారిని అందరూ కలిసి  సహపంక్తి భోజనం చేశారు. మెనూ ప్రకారం కచ్చితంగా ఆహారం వండాలని పిల్లలకు కచ్చితంగా పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పిల్లల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. పిల్లలకు ఊరికే ఇంటికి తీసుకువెళ్లద్దని ఇక్కడ చదువులలొ వెనుకబడిపోతారని తప్పక ఎప్పుడో 15రోజులకు ఒకోసారి వచ్చి తమ పిల్లల బాగోగులు అడిగి తెలుసుకుని పోవాలని నిత్యం ఇండ్లకు తీసుకుపోవడం వలన నష్టపోయేది పిల్లల చదివేనని తల్లిదండ్రులకు హీతవు పలికారు. పిల్లలు ఉండే గదులను పరిశీలన చేసి చలి పెరగడంతో కిటికీలు బాగున్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారినితో పాటు జుక్కల్ ఎంపీడీవో హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love