పల్నాడులో ఇద్దరు వైసీపీ ఎమ్మేల్యేల హౌస్ అరెస్ట్

నవతెలంగాణ – పల్నాడు: జిల్లాలో వైసీపీకిచెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నరసరావుపేటలో కాసు మహేశ్‌రెడ్డి, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ముగ్గురి కంటే ఎక్కువమంది గుమిగూడవద్దని ఎస్పీ బిందుమాధవ్‌ సూచించారు. సామాన్యుల జీవనానికి ఆటంకాలు కలిగించబోమన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

Spread the love