– ఏటురూనాగారం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చిదురాల వాసుదేవ్
– మంత్రి సత్యవతి రాథోడ్ కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లాలోని ఏటూర్ నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి మండలాలలో గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని. ప్రతి దళిత జర్నలిస్టుకు దళిత బంధు పథకం మంజూరు చేయాలని, ఏటూర్ నాగారం కేంద్రంగా ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం చేయుటకు నిధులు కేటాయించాలని కోరుతూ సోమవారం తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలోని ఐటిడిఏ క్యాంప్ ఆఫీస్ లో ఏటూరు నాగారం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చిదురాల వాసుదేవ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు గిరిజన స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులు అందించిన వినతిపత్రం స్వీకరించిన మంత్రివర్యులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు బాగా స్వాములుగా ముఖ్య భూమిక పోషించారని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు యూనియన్ నాయకులు రాజు, ఏటూరు నాగారం ప్రెస్ క్లబ్ యూనియన్ నాయకులు వసంత రమేష్, గంపల శివకుమార్, కుదురుపాక ప్రవీణ్ కుమార్, యనమల్ల రాకేష్, ముండ్రాతి ప్రతాప్, ముసుగు గోవర్ధన్ రెడ్డి, నరేష్, వడ్లకొండ వీరయ్య, రమేష్, నరేష్ ,మెరుగు వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.