మండలంలోని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల దామరవాయిలో వైద్యాధికారి డాక్టర్ రంజిత్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, వైద్య సిబ్బంది టీం మంగళవారం ప్రతి ఇల్లు ఇల్లు తిరిగి యాంటీ లార్వా సర్వే, జ్వరం సర్వే కూడా నిర్వహించారు. డెంగ్యూ దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు కూలర్లు, ఫ్రిడ్జ్ ట్రేలు, కుండలు, ఖాళీ టైర్లు, బాక్సులు, లార్వా కలిగి ఉన్న కంటైనర్లను తొలగించారు. నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో, మురికి కాల్వల్లో దోమల మందు పిచికారి చేశారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎం ఎల్ హెచ్ పి, ఎండి ఆస్పియా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఇ ఓ సమ్మయ్య, రాంబాబు, ఏఎన్ఎంలు రాజేశ్వరి, చంద్రకళ, హెల్త్ అసిస్టెంట్లు ముత్తయ్య ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.