ప్రస్తుతం యువత మేకప్ వేసుకుంటే చాలు అందంగా ఉంటామని భావిస్తున్నారు. అందుకోసం వాడే బ్యూటీ ప్రొడక్ట్స్ కారణంగా కొంతమంది ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కండ్లు, కళ్లరెప్పల కోసం వాడే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో హాని కలిగించే వాటి గురించి ఒకసారి పరిశీలిద్దాం.
నేటి తరం యువత కంటి మేకప్ మీద దృష్టి పెడుతున్నారు. కళ్ళు అందంగా పెద్దవిగా కనిపించాలని పలు రకాల ప్రోడక్ట్స్ వాడతారు. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ కళ్లకు హానిచేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో ఉపయోగించే కొన్ని రసాయనాల కారణంగా కంటిచూపు దెబ్బతినడంతో పాటు పలు రకాల ఇన్ఫెక్షన్స్ కూడా కలిగే అవకాశం ఉంది.
మనం ఉపయోగించే పలు రకాల ఐ మేకప్ ఉత్పత్తుల్లో ఫైన్ పౌడర్ జడ్ గ్లిట్టర్ లాంటి పదార్థాలు మన కనురెప్ప మీద గ్రంధులను మూసివేసి ఇన్ఫెక్షన్స్ కలిగిస్తాయి. ఈ మేకప్ ఉత్పత్తుల కారణంగా కంటి పై హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల కంటి ఉపరితలంపై పలు రకాల సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో ఇది తీవ్రమైన కంటి ఇన్ఫెక్షన్ కి కూడా దారితీస్తుంది.
ఐలేషస్ పొడుగుగా అందంగా కనిపించాలి అనే ఉద్దేశంతో చాలామంది ఎక్కువగా మస్కారా వంటివి వాడుతారు. అయితే వీటివల్ల వెంట్రుకలు జోడించబడడంతో పాటు చర్మం దగ్గర ఇరిటేషన్ కూడా కలుగుతుంది. పైగా మస్కార వాడిన తరువాత సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే బ్యాక్టీరియా ఫాం అవుతుంది.
ప్రస్తుతం చాలామంది కాంటాక్ట్ లెన్సెస్‌ను ఎక్కువగా వాడుతున్నారు. అవి సరిగ్గా శుభ్రం చేయనట్లయితే కంటి లోపల ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంది. దీని కారణంగా దృష్టి పోయే అవకాశం కూడా ఉంది అంటున్నారు నిపుణులు. అందుకే మీరు వాడే లెన్స్‌లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి మూడు నెలలకు కాంటాక్ట్ లెన్సెస్ మారుస్తూ ఉండాలి.