చదువుకున్న పాఠశాల కు ఎంత చేసిన తక్కువే..

– 80 వేల క్రీడా సామగ్రి అందజేత..
నవతెలంగాణ – డిచ్ పల్లి
గ్రామంలో పుట్టి, ప్రభుత్వ పాఠశాలలో విద్యాబుద్దులు నేర్చుకుని నేడు ఉన్నత స్థానం లో ఉన్న చదువుకున్న పాఠశాలకు ఎంత చేసిన తప్పినని దానిలో భాగంగానే తనవంతు సహాయ సహకారాలు అందజేయలనే ధృడ సంకల్పంతో 80 వేల రూపాయల విలువ గల క్రీడా సామగ్రి ని అందజేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు కుంట రాజిరెడ్డి. క్రీడా సామగ్రి ని సర్పంచ్ కుంట మోహన్ రెడ్డి చేతులు మీదుగా శనివారం పాఠశాల అధ్యాపకులు, విద్యార్థుల కు అందజేశారు. ఎస్& పి గ్లోబల్ మల్టీ నేషనల్ కంపెనీ లో ఉద్యోగీ చేస్తున్న ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన కుంట రాజారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తన సొంత గ్రామమైన గన్నారం గ్రామానికి, తాను చిన్నప్పుడు చదువుకొని తన జీవితం లో స్థిరపడి ఉన్నతమైన కొలువు సంపాదించడానికి కారణమై, విద్యా బుద్దులు నేర్పించిన జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కు 80 వేల రూపాయల క్రీడా వస్తువులను అందజేసినట్లు క్రీడా సామగ్రి దాతా కుంట రాజిరెడ్డి అన్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ కుంట మోహన్ రెడ్డి మాట్లాడుతూ చదువుకున్న పాఠశాలకు తన వంతు ఏదో చేయాలని దృడ సంకల్పంతో క్రీడ సామాగ్రిని అందజేసి, పాఠశాలలో ఉన్న విద్యార్థులకు అన్ని క్రీడల్లో సత్తా చాటి, నైపుణ్యం ప్రదర్శించి గ్రామం పేరు ప్రఖ్యాతలు గావించే విద్యార్థులు కృషి చేస్తారనే ఉద్దేశంతోనే సామాగ్రిని అందజేయడం హర్శించదగ్గ విషయ మన్నారు. విద్యార్థులు కుంట రాజిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాండ్ల భైరయ్య, వార్డ్ మెంబెర్ పళ్ళ శేఖర్, గ్రామ అభివృద్ధి కమిటి సభ్యులు, ప్రధానోపాధ్యా యులు వీర లక్ష్మి, అధ్యాపక బృందం, రాజిరెడ్డి చిన్ననాటి స్నేహితులు సతీష్ , గణేష్ , జీవన్ రెడ్డి, క్రాంతి కుమార్ రెడ్డి, నరేశ్, లక్ష్మి నర్సయ్య విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love